హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎనికేపాడులో పలు హోటళ్లపై దాడులు

కృష్ణా: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని పలు హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు. ముందస్తు సమాచారంతో ఓ టిఫిన్ సెంటర్‌పై చేసిన దాడిలో కమర్షియల్ సిలిండర్‌కి బదులు గృహాల్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. సర్కిల్-3 ఏఎస్ఓ లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.