హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చంద్రబాబు చేసినవన్నీ అసత్య ఆరోపణలు'

కోనసీమ: జగన్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అసత్య ఆరోపణలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఖండించారు. గురువారం ఆయన అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.