హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.