హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమాశంకర్ కుటుంబానికి పార్టీ అండ: ఎమ్మెల్యే

CTR: జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం శెట్టిపల్లి పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త ఉమాశంకర్ ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.