హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీటి కోసం మహిళల ధర్నా

కృష్ణా: నందివాడ (M) పోలుకొండలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో పోలుకొండ, ఇంగిలింపాకలంక గ్రామాలకు చెందిన మహిళలు ఇవాళ ఆందోళనకు దిగారు. పోలుకొండ కొత్త వంతెన సమీపంలో మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాగునీటి కోసం గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, నీటి కోసం నిత్యం గొడవలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.