హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి'

AKP: గర్భిణులు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వవచ్చని సీడీపీవో వి.లలితకుమారి తెలిపారు. పరవాడ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్డు, పాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆహారంలో చేర్చాలని సూచించారు. అలాగే, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు.