BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని చర్చి కాంపౌండ్ సమీపంలో డ్రైనేజీ నీరు రహదారిపై పొంగిపొర్లుతుండటంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉర్దూ పాఠశాల ఎదుట మురుగునీరు నిలవడంతో విద్యార్థుల రాకపోకలకు ఆటంకం కలగడమే గాక, దుర్వాసన, దోమల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలాని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చర్చి కాంపౌండ్ వద్ద డ్రైనేజీ సమస్య


