ELR: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని భీమడోలు సీఐ. కృష్ణ, ఎస్సై ఎస్.కే. మదీనా బాషా సూచించారు. భీమడోలు పోలీస్ స్టేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాల ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం చేసి మార్గదర్శకాలు సూచించారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన వైరింగ్ వాడాలని, శబ్ద కాలుష్యం కలిగించే డిజే (DJ)లకు అనుమతి లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి వేడుకలపై పోలీసుల సమావేశం


