NTR: వీరులపాడు మండలం పెద్దాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటిపై రేకుల షెడ్డు వేస్తున్న సమయంలో ఐరన్ పైపులు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో స్వామి అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


