హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ సరుకుల పంపిణీపై పరిశీలన

CTR: యాదమర్రి మండలంలో ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్ గురువారం పర్యటించారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, కీనాటంపల్లిలోని ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని తనిఖీ చేసి నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ఎన్. వెంకటరాముడు, సివిల్ సప్లై డీఎం లక్ష్మీ, ఐసీడీఎస్ పీడీ ఎఫ్‌ఏసీ శ్యామ్ సుగుణకుమారి, అధికారులు పాల్గొన్నారు.