హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచి బోధనతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యం: డీఎస్పీ

VKB: నైతిక విలువలతో కూడిన బోధన చేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమని తాండూరు DSP నర్సింగ్ యాదయ్య అన్నారు. తాండూరు మండల PRTU అధ్యక్షుడిగా జొన్న వినోద్, కార్యదర్శిగా పురుషోత్తం రెడ్డి రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.