హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

WGL: నర్సంపేట చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు షేక్ జావీద్ పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.