హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవాల సంతలో కనీస సౌకర్యాలు కల్పించాలి'

అన్నమయ్య: గాలివీడులో ప్రతి గురువారం జరిగే జీవాల సంతలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రంగా రెడ్డి పేర్కొన్నారు. ఈ సంతకు 4 జిల్లాల నుంచి రైతులు, వ్యాపారులు వస్తుంటారన్నారు. ఇక్కడికి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.