KNR: నగరపాలక సంస్థ 34వ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో మున్సిపల్ సాధారణనిధులతో చేపట్టనున్న వాటర్ పైపులైన్ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సమీని పర్వీన్, కో ఆప్షన్ సభ్యులు నందకుమార్ ఉన్నారు.
తెలంగాణ
పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్


