హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా ప్రమాణాలపై DEO ఆరా

W.G: నరసాపురం పట్టణంలోని పీచుపాలెం మున్సిపల్ హైస్కూల్‌ను DEO అనిల్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉపాధ్యాయుల వివరాలు, తరగతుల వారీగా విద్యార్థుల హాజరుతో పాటు విద్యా ప్రగతిపై ఆరా తీశారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసిన ఆయన, పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సిబ్బందికి సూచించారు.