హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మావుళ్లమ్మ అమ్మవారికి విరాళం అందజేత

W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు మంగళగిరికి చెందిన భోగి అంజియ్య, తిరుపతమ్మ దంపతులు 6.4 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, తదితరులు పాల్గొన్నారు.