GDWL: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద ఆమె చిత్రపటానికి గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని, ఆమె జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్


