హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూకబ్జా కేసులో డాక్యుమెంట్ రైటర్ అరెస్ట్: DSP జీవన్ రెడ్డి

ADB: జైనథ్ పరిధిలోని రాంపూర్-టిలో నకిలీ వారసత్వ పత్రాలతో వ్యవసాయ భూమిని కబ్జా చేయడానికి యత్నించిన కేసులో దర్యాప్తు వేగవంతమైందని DSP జీవన్ రెడ్డి గురువారం తెలిపారు. నిందితుడి కస్టడీ విచారణలో తేలిన వివరాల ఆధారంగా డాక్యుమెంట్ రైటర్ మహమ్మద్ పైజుద్దీన్ సిద్ధిఖీని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.