హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరిత హోటల్‌పై బాలా త్రిపుర సుందరి ఫైర్‌

MBNR: జడ్చర్ల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లిలో హరిత టూరిజం హోటల్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి విమర్శించారు. ముందుగా రోడ్లు, తాగునీరు, విద్యుత్, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ రహదారి, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని కోరారు.