NGKL: లింగాల మండలం అపాయిపల్లి గ్రామానికి నూతన రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసినట్లు సర్పంచ్ విజయకృష్ణ తెలిపారు. గ్రామంలో ప్రజలకు పాలనా సేవలు నిరంతరాయంగా అందడానికి, అభివృద్ధి పనులు సజావుగా సాగడానికి రెగ్యులర్ కార్యదర్శి నియామకం అత్యంత అవసరమని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
తెలంగాణ
రెగ్యులర్ గ్రామ కార్యదర్శిని నియమించాలి: సర్పంచ్


