హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక చవితి ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి'

BDK: పినపాక మండలంలో గురువారం ఎంపీడీవో సంకీర్త్‌ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని సూచించారు. గణేష్‌ మండపాల వద్ద తడి, పొడి చెత్తకు ప్రత్యేక డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించాలని తెలిపారు. మట్టి విగ్రహాలు, నిర్మాల్యం కంపోస్టింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు.