హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న మట్టి గణపతులను ప్రతిష్ఠించాలి: ఏసీపీ

HNK: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటల్లో నీరు తగినంతగా లేకపోవడంతో ఈసారి వినాయక చవితి సందర్భంగా చిన్న మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. పెద్ద విగ్రహాలకు ఖర్చు చేసే డబ్బుతో పేదలకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.