JGL: గ్రామాభివృద్ధికి సర్పంచుల కృషి, అధికారుల సమన్వయం ఎంతో అవసరమని జగిత్యాల డీపీఓ మదన్ మోహన్ అన్నారు. గురువారం రేచపల్లి గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో నీరజ, ఎంపీఓ సలీం, సర్పంచ్ బాస మహేష్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'గ్రామాభివృద్ధికి సర్పంచుల కృషి, అధికారుల సమన్వయం అవసరం'


