ADB: కేసులు, సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హుస్సేన్ తెలిపారు. గురువారం ఉట్నూరు మండలంలోని సాలెవాడ(కె) గ్రామంలో లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
తెలంగాణ
'కోర్టుకు వెళ్లకుండా లోక్ అదాలత్‌తోనే పరిష్కారం'


