హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిట్టపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్

MNCL: అర్హులైన వారికి చేయూత పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న సర్ హియరింగ్ సభ, చేయూత దరఖాస్తుల స్వీకరణ, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాలలో లోటు పాట్లు రాకుండా చూడాలన్నారు.