హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పక్కనే నియంత్రికలు.. పొంచి ఉన్న ప్రమాదం

VKB: హకీంపేట నుంచి దుద్యాలకు వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ నియంత్రికలు ప్రమాదకరంగా మారాయి. ఈ నియంత్రికలు రోడ్డుకు సమాంతరంగా ఉండగా వీటి చుట్టూ ఎలాంటి రక్షణ కవచం లేదు. వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదం జరగే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.