హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: TRS కార్యాలయంలో చాకలి ఐలమ్మకు నివాళి

HYD: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ, అనగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడారని ఆమె సేవలను స్మరించుకున్నారు.