JN:స్టేషన్ ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగల్లు గ్రామానికి చెందిన సత్తయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుండి మడికొండ వైపు వెళ్తున్న ఆటో వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ
ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


