ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఎదురుగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి వేడుకలను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్


