హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సారపాకలో అక్రమ ఇసుక రవాణా..!

BDK: బూర్గంపాడు సారపాకలో గురువారం పట్టపగలే ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని చెబుతున్నారు. అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.