హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

BHNG: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆలేరు ZPHS ఆవరణలోని ఆమె విగ్రహానికి రజక సంఘం జనరల్ సెక్రటరీ ఆలేటి అజయ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.