హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఉత్కంఠ

ASF: తిర్యాణి మండల రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జోరందుకుంది. త్వరలో పోస్టులు భర్తీ చేస్తామని అధిష్ఠానం ప్రకటించడంతో కాంగ్రెస్ 2 వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఓ వర్గానికి కీలక పదవులు దక్కగా మరో వర్గం నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో భర్తీ చేసే PACS ఛైర్మన్ పదవి తమకే దక్కుతుందని ఓ వర్గం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.