KMR: దోమకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మధురిమ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి జ్యోతి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. మండలంలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో కోరారు. సమావేశంలో మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
దోమకొండలో రేపు మండల సర్వసభ్య సమావేశం


