హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిమాపక భద్రతపై అవగాహన సదస్సు

RR: గచ్చిబౌలిలోని ఈఎస్‌సీఐలో పబ్ యజమానులు, ప్రతినిధుల కోసం ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్నిమాపక సేవల డీజీ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. భద్రత సామూహిక బాధ్యతని, వినోద ప్రదేశాలలో రాజీకి తావులేదన్నారు. ఫైర్ ఎన్ఓసి నిబంధనలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై అవగాహన కల్పించారు.