హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో పశువైద్యశాల

JN: కొడకండ్ల(M) కేంద్రంలోని దశాబ్దాల నాటి పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం ఎప్పుడు కూలుతుందోనని అక్కడ విధులు నిర్వహించే సిబ్బందితో పాటు, పశువులను తీసుకొచ్చే రైతులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ భవనం స్థానంలో నూతన పశువైద్యశాల భవనాన్ని నిర్మించాలని అధికారులు, పాలకులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు గట్టిగా కోరుతున్నారు.