JGL: గొల్లపల్లి మండలం మల్లన్నపేటకు చెందిన BRSV నాయకుడు అవారి చందుతో పాటు సూర్య, సాయిలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ఈ అరెస్టులు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని అన్నారు.
తెలంగాణ
గొల్లపల్లిలో నాయకుల ముందస్తు అరెస్ట్


