హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కాలసర్ప దేవాలయంలో విశేష పూజలు

BHNG: శ్రావణ మాస బహుళ అమావాస్య సందర్భంగా రేపు శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి కాలసర్ప దేవాలయంలో విశేష పూజలు, అభిషేకాలు, మహా హోమాలు నిర్వహించనున్నారు. నాగదేవతకు రుద్రాభిషేకంతో పాటు నవగ్రహ, నక్షత్ర, మానసాదేవి, రాహు-కేతు హోమాలు చేపట్టనున్నారు. పూజ అనంతరం పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ, అన్నసంతర్పణ ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.