హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి

WGL: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని నేడు పురస్కరించుకుని ప్రజలు ఆమెను స్మరించుకుంటున్నారు. నిజాం పాలన, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద రైతులు, కూలీల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారు. తన భూమిని కాపాడుకునేందుకు సాగించిన పోరాటంతో తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మహిళలకు స్ఫూర్తిగా నిలిచి ధీరవనితగా గుర్తింపు.