హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిర్మల్ రైతులకు సాగునీరు అందించాలి'

NRML: SRSP సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్రీహరిరావు బుధవారం కోరారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి కాలువ ద్వారా నియోజకవర్గానికి నీటిని అందించాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.