BDK: బూర్గంపహాడ్‌లో ఆర్థిక ఇబ్బందులతో సాధనాల నాగేశ్వరరావు(39) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మాంసం దుకాణం నిర్వహించే నాగేశ్వరరావు గ్రామ శివారులో ఉరేసుకుని మృతి చెందాడు. బెట్టింగ్‌లకు బానిసై ఆర్థికంగా నష్టపోయినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


