KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,340.01 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు చేరుకున్నాయని గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాకు 740.01, భద్రాద్రికి 300, మహబూబాబాద్‌కు 200 మెట్రిక్ టన్నులు కేటాయించామని తెలిపారు. మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాగ్‌గా నిల్వ చేశామని ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న కాంప్లెక్స్ ఎరువులు


