హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్‌లకు కూలిన ఇంటి ప్రహరీ

MNCL: సింగరేణి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్‌లకు కాసిపేట్ మండలం సోమగూడం (కె) గ్రామ పంచాయతీలో శెట్టి శాంతకు చెందిన ఇంటి ప్రహరీ కూలిపోయింది. ఓసీపీలో బ్లాస్టింగ్ దెబ్బలకు గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు బాధితులు తెలిపారు. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వాపోయారు. సింగరేణి యాజమాన్యం పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు తెలిపారు.