KNR: గంజాయి కేసులో నిందితుడికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. 2022లో నమోదైన కేసులో జుంబర్తి ఈశ్వర్‌కు కరీంనగర్ ప్రత్యేక కోర్టు 5 ఏళ్ల కఠిన శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. నిందితుడి నుంచి 1.100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు.
తెలంగాణ
గంజాయి కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష


