హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

JGL: వినాయక ఉత్సవాలకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెట్‌పల్లి డీఎస్పీ ఏ.రాములు, సీఐ సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ, డీజే నిర్వాహకులు, కమ్యూనిటీ హెల్పర్లతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు తప్పక పాటించాలని, అనుమతిలేని డీజేలకు చోటు లేదని స్పష్టం చేశారు.