హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన

NRML: పెండింగ్‌లో ఉన్న పనుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు గుత్తేదారులు భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. గతేడాది వినాయక చవితి, దుర్గా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, ధమ్మచక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమాలకు సంబంధించి చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.