MLG: కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి పంచాయతీ పరిధి భూపతిపూర్ గ్రామంలో ఒకరు ఆత్యహత్యాయత్నం చేశారు. గ్రామస్థుల కథనం ప్రకారం భూపతిపూర్ గ్రామానికి చెందిన రైతు అమిలి సమ్మయ్య బుధవారం పత్తి చేను వద్ద గడ్డి మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఏటూరునాగారం సామాజిక ఆసుప త్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ
గడ్డి మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం


