ASF: వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన రేష్మకు బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ఇందాని నుంచి ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా తేజుగూడ సమీపంలో నొప్పులు తీవ్రం కావడంతో EMT సంతోష్ అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. రేష్మ రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తెలంగాణ
అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


