హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు'

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని SP నితికా పంత్ తెలిపారు. వ్యవసాయ భూముల్లో అంతరపంటగా గంజాయి సాగు చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వల్ల భవిష్యత్తు నష్టపోతుందని, రైతులు నిషేధిత సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. సమాచారం తెలిస్తే 112కు తెలియజేయాలన్నారు.