ASF: ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1 నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. లోతట్టు కాకుండా ఎత్తైన ప్రదేశాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదాములు, గన్నీ సంచులు,రవాణా వాహనాలు సిద్ధం చేయడంతో పాటు కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'అక్టోబర్ 1 నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి'


