MBNR: కొల్లాపూర్ పరిధిలో అక్రమ ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. చుక్కాయిపల్లి, వరిదేల, చౌటబెట్ల మూలవాగుతో పాటు రామాపురం, పెంట్లవెల్లి, మాధవస్వామినగర్ గ్రామాల గుండా ప్రవహించే వాగుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వాగులకు ఇరువైపులా పట్టా భూముల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. బహిరంగంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
వాగుల్లో ఇసుక దోపిడీ జోరు


